విడాకులకు కారణాలు ఇవే..? సంచలన నిజాలు చెప్పిన క్రిష్ణ చైతన్య రెడ్డి.

రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వీరి అభిమానులు, నెటిజనులు బాధపడ్డారు. ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి ఐడ్రీమ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ముందు నుంచి తన జీవితం, నేత్రాతో పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రొఫేషనల్‌ లైఫ్‌ అన్నింటి గురించి చెప్పుకొచ్చాడు.

అయితే వంశీకృష్ణారెడ్డి విడాకులపై ఆయన అన్నయ్య క్రిష్ణ చైతన్య రెడ్డి స్పందించారు. ఐడ్రీమ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. క్రిష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా తమ్ముడిది ప్రేమ పెళ్లి అనే కంటే అరెంజ్డ్‌ మార్యేజ్‌ అని చెప్పవచ్చు. పెళ్లి చూపుల్లో కలిశారు.. మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 13 రోజుల్లోనే వారు వివాహం చేసుకున్నారు.

ఇబ్బంది పడుతూ కలిసి ఉండటం కన్నా.. విడిపోయి.. వాళ్లకి నచ్చిన దారిలో పయనిస్తే తప్పు కాదు కదా. వారిద్దరి దారులు వేరే.. కలిసి ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్‌ కాలేదు.. అందుకే విడిపోయారు. పెళ్లి ఎంత పవిత్రమో.. కలిసి బతకలేనప్పుడు విడాకులు తీసుకోవడం కూడా అంతే పవిత్రం అని నేనే నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *