స్టేజి మీదే డైరెక్టర్ ని పచ్చి బూతులు తిట్టిన అజయ్‌ ఘోష్, ఎందుకో తెలుసా..?

అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో విలన్ కొండారెడ్డిగా నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నటుడు అజయ్ ఘోష్. ప్రస్థానం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి మూవీలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత రంగస్థలం, రాజు గారి గది 3 వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఓవైపు పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు తనదైన శైలీలో కామెడీని పండిస్తూ.. హాస్యనటుడిగానూ అలరించారు. అయితే ‘సినిమాల్లో అవకాశాల కోసం తిరిగి .. తిరిగి అలసిపోయాను. మొదటి సినిమా ‘ప్రస్థానం’లో దేవ కట్టా గారు ఛాన్స్ ఇచ్చారు .. ఆ తరువాత చేసిన ‘జ్యోతి లక్ష్మి’తో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తరువాత కూడా ఏడాదిన్నర వేషాలు లేక .. మళ్లీ కూలి పనులకే వెళ్లడం జరిగింది.

‘రంగస్థలం’ .. ‘పుష్ప’ సినిమాలలో నాకు మంచి వేషాలనిచ్చి ప్రోత్సహించింది సుకుమార్ గారు ” అని చెప్పారు. “నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. కానీ తెలుగులో పూరి .. సుకుమార్, తమిళంలో వెట్రి మారన్ వంటి దర్శకుల సినిమాలలో చేశాను .. అది నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం. త్వరలో విడుదల కానున్న ‘బెదురులంక’లో కూడా మంచి వేషం వేశాను. యువ దర్శకులు కూడా మంచి వేషాలను ఇస్తున్నారు” అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *