ఆ రోజు నిష్ఠనియమాలతో పూజలు చేస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఆ రోజు ఉదయం నిద్రలేచి, సమీపంలోని నదిలో లేదా చెరువులో స్నానం చేసి, పితృదేవతలకు పూర్వీకులకు తర్పణం చేయండి. నదులు, చెరువులు, సముద్ర తీరాన తర్పణం ఇవ్వవచ్చు. అయితే జాతకంలో పితృదోషం ఉన్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆషాఢమాసం అమావాస్య రోజున తలస్నానం చేయాలని నమ్మకం. ఇలా స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలిపి స్నానం చేయడం అత్యంత విశిష్టత. జాతకంలో కాల సర్ప దోషం ఉన్నవారు అమావాస్య తిథి నాడు వెండితో చేసిన పాములను పూజించి ప్రవహించే నదిలో విడిచి పెట్టడం వలన దోష పరిహారం జరుగుతుందని విశ్వాసం.
అమావాస్య రోజున ముందుగా తమ పూర్వీకులను ధ్యానించాలి. తర్వాత పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవాలి. పూర్వీకుల కోసం దక్షిణ దిశ ఉత్తమం. మరోవైపు తర్పణం లేదా పిండ ప్రధానం మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలి. తర్వాత పూర్వీకులకు బియ్యం సాయసం,గారెలు సమర్పించండి. పితృ దోష నివారణకు పూర్వీకుల కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసిన వ్యక్తికి అతని పెద్దల ఆశీర్వాదం లభిస్తుందని.. సంతోషంగా ఉంటాడని నమ్మకం. జీవితానికి సంబంధించిన కష్టాలు తొలగిపోవాలంటే నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని, చేపలకు పిండితో చేసిన బాల్స్‌ను అమావాస్య రోజున ఆహారాన్ని అందించండి.
ఆషాఢమాసంఅమావాస్య రోజున నదీస్నానం చేసి.. ఇచ్చే దానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి పరిస్థితిలో అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత, అవసరమైన వారికి ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయండి. ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పూజ చేసి .. పాలు, పంచదార కలిపి అర్ఘ్యం సమర్పించి నైవేద్యంగా పెడితే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాడం అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయడం వలన జాతకంలో పితృ దోషం తొలగిపోతుందని విశ్వాసం.