ధోనీ అనే పేరుకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేక చాప్టర్ ఉందనడంతో ఎలాంటి సంశయం లేదు. అయితే, ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందడం వెనుక ధోనీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఎనలేనిదని చెబుతాడు మిస్టర్ కూల్. అయితే ఐపీఎల్ లోనూ ధోనికి కెప్టెన్ గా అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ను ఏకంగా 5 సార్లు చాంపియన్ గా నిలబెట్టాడు. ఐపీఎల్ ల్లోనూ అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైకు పేరుంది. ఇక ధోని సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు కావొస్తున్న మార్కెట్ లో ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ధోని, సాక్షి దంపుతలకు జీవా 2015లో జన్మించింది. ప్రస్తుతం జీవా వయసు 8 ఏళ్లు. ఇక ధోనికి జీవా అంటే ప్రాణం. క్షణం తీరిక దొరికినా చాలు జీవా కోసం కేటాయిస్తాడు. ధోని తలచుకుంటే జీవాను విదేశాల్లో చదించగలడు. అయితే అతడు అలా చేయలేదు. స్వస్థలం రాంచీలోనే తన కూతురును ధోని చదిస్తున్నాడు.
రాంచీలోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో జీవా డే స్కాలర్ గా ఉంది. ఇక జీవా స్కూలు ఫీజు ఏడాదికి రూ. 2.75 లక్షలు. అంటే నెలకు రూ. 23 వేల రూపాయలు. చాలా మందికి ఇది పెద్ద మొత్తమే కావొచ్చు. ఇక జీవా చదివే స్కూల్లో హాస్టల్ లో ఉండాలంటే మాత్రం ఏడాదికి రూ. 4.40 లక్షలు అవుతుందని సమాచారం. ఇక ధోనికి రాంచీలో విలాసవంతమైన ఫామ్ హౌజ్ ఉంది. ప్రస్తుతం తన భార్య, కూతురుతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. జీవాకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 2.3 మిలియన్ ఫాలోవర్లు ఉండటం విశేషం.