మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్లలో చూసినా, నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయని, నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు. అయితే మృత్యువు రాకముందే.. మృత్యువు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. వైద్యరంగంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారట.
మరికొందరు దీనిని కొట్టిపారేస్తుంటారు. సాధారణంగా చాలామందికి మృత్యువు సంకేతాలు తెలియవు. తమ ప్రియమైన వారు అకస్మాత్తుగా మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోతుంటారు. అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు మరణ సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో వెల్లడైంది.. ఎవరైనా మరణం సమీపిస్తున్నప్పుడు అతని ఆహారం, పానీయం తగ్గుతుంది. ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడటం ప్రారంభిస్తాడట..ఈ అసాధారణ లక్షణాలు భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతం.
మరణానికి 2 వారాల ముందు నుంచే సంకేతాలు..ఒకరి మరణానికి 1-2 వారాలు మిగిలి ఉన్నప్పుడు మరణం లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయట…ఈ దశలో వ్యక్తి అన్ని సమయాలలో అలసటగా నిర్జీవంగా ఉంటాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడట.. అతను కోరుకున్నప్పటికీ మంచం విడిచిపెట్టడానికి ధైర్యం చేయలేడు… అతని నిద్ర-మేల్కొనే విధానం కూడా మారుతుంది. ఈ సమయంలో మరణానికి దగ్గరగా ఉండే వారి ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస విధానంలో మార్పులు కనిపిస్తాయి. ఇంటిని వదిలిపెట్టి అస్సలు రారు.