దాసరి మరణం వెనుక ఎవరికి తెలియని రహస్యం..? చనిపోయే ముందు కూడా..?

150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు 53 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో దాసరి నారాయణరావు నటించారు. అయితే అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిన ఈయన తన తదనంతరం మరెవరూ కూడా ఈ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు అనే కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ , దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన స్వయంకృషితో సినిమా రంగానికే పెద్దదిక్కుగా మారి.. కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. కొన్నాళ్లపాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఉన్నట్టుండి ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది. అసలు విషయంలోకి వెళితే దర్శకుడు రేలంగి నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావు సన్నబడడం కోసం బెలూన్ వేయించుకున్నారు.

ఆ సమయంలో సన్నబడ్డారు కానీ ఆరు నెలల తర్వాత బెలూన్ తీసేసి కొత్త బెలూన్ వేయాలని చెప్పారు. అయితే జూనియర్ డాక్టర్లు ఆ బెలూన్ వేయడంతో ఆ బెలూన్ ఫంక్షన్ కావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ సోకి ఆయన మరణించారు అంటూ రేలంగి నరసింహారావు వెల్లడించారు. ఒకవేళ బరువు తగ్గడానికి ఆయన మరొక మార్గాన్ని అనుసరించి ఉండి ఉంటే.. కచ్చితంగా ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *