బాలయ్యకి సీజన్ తో సంబంధం లేదు. వర్షాకాలం అయితే చినుకు జై బాలయ్య అంటూ శబ్దం చేస్తాయి. వేసవిలో సూర్య కిరణాలు కూడా జై బాలయ్య అంటూ వస్తాయి. చలికాలంలో పిల్లగాలికి పచ్చ జెండాలు జై బాలయ్య అంటూ రెపరెపలాడతాయి. అయితే ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించడం కోసం ఒక ఆర్టిస్టు ఏదైనా గట్టిగా చెబితే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది.
ఇక ఇంతకంటే మంచి మాధ్యమం మరొకటి ఉండదని నా అభిప్రాయం.ఇక ఈ సినిమా కూడా ఎవరో చెబితే నేను చేయలేదు. నాకు నచ్చే ఈ సినిమాలో చేశాను. అంతేకాదు నా బాధ్యతగా వ్యవహరించి ఈ సినిమాకి ఓకే చెప్పాను అంటూ బాలకృష్ణ భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు అని అన్నారు.