కరోనా కొత్త వైవిధ్యాలతో ఇన్ఫెక్షన్ ప్రపంచదేశాల్లో పెరుగుతున్నా.. తీవ్రమైన పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కొమొర్బిడిటీ బాధితులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే ఎక్కువ ప్రమాదం కనిపిస్తుందని పేర్కొంటున్నారు. స్క్రిప్స్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా ఎక్స్‌బీబీ సిరీస్‌లోని వేరియంట్ల కంటే రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
అయితే భారత్‌లో ఇదీ పరిస్థితి… భారత్‌లో ఈజీ.5 వేరియంట్ మే నెలలో వెలుగు చూసినట్టు కేంద్రం తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించినట్టు వెల్లడించింది. మరోవైపు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఓ సర్వే హెచ్చరించింది. ఈ రాష్ర్టాల్లో జ్వరం, కొవిడ్ లక్షణాలతో చాలామంది బాధపడుతున్నారని లోకల్ సర్కిల్స్ ఫౌండ్ వెల్లడించింది. వెలుగులోకి కొవిడ్ దుష్పరిణామాలు…మరోవైపు సుదీర్ఘ కొవిడ్ వల్ల సంభవించే దుష్పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొవిడ్‌తో పోరాడి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి కాళ్లు నీలం రంగులోకి మారుతున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు తెలిపారు. ఆ వ్యక్తి 10 నిమిషాలు నిలబడితే అతని కాళ్లు క్రమంగా నీలం రంగులోకి మారుతున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. తిరిగి కూర్చోగానే సాధారణ స్థితిలోకి మారుతున్నాయని తెలిపారు. అక్రోక్యానోసిస్‌గా పిలుచుకునే ఈ అరుదైన వ్యాధి గురించి లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.
