1988 లో జరిగిన ఘటన అది. ఒక అభిమాని అత్యుత్సాహం.. ఆపై పొరపాట్లు కారణం ఏదైనా మెగాస్టార్ పై విష ప్రయోగం జరిగింది! ఇదంతా ఆయన ఎదుగుదలను సహించలేని వాళ్ల కుట్ర!! అంటూ ప్రచారం సాగిపోయింది. అప్పట్లో అన్ని దినపత్రికలు హైలైట్ గా ఈ వార్తను ప్రచురించడం తో నాడు ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఒక సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి దాడి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి.
అయితే అక్కడున్న పోలీసులు తొందరగా అప్రమత్తం ఇవ్వడం వల్ల ప్రమాదం ఏమి జరగకుండా అందరిని సేఫ్ చేశారు. అయితే ఆ ప్రమాదం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు చిరంజీవి యొక్క స్టార్ డమ్ ను చూసి ఓర్వలేక ఎవరో ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అంటూ అప్పట్లో పేపర్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి చిరంజీవి తన హార్డ్ వర్క్ తో ప్రతి సినిమాని చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకుంటు ఈ స్టేజి దాకా వచ్చాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా ఆయన తన సత్తా చాటుతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఉన్న స్టార్ డమ్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 2023 వ సంవత్సరంలో ఎవరికి సాధ్యం కానీ విధంగా రెండు సినిమాను రిలీజ్ చేసి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు…ఇక ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ అవ్వగా, భోళా శంకర్ మాత్రం ప్లాప్ అయ్యింది.