మినిస్టర్ రోజా మెగా ఫ్యామిలీ పై విమర్శలు చెయ్యడం సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే.. అయితే అభిమానులు చాలా తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు..పిల్లికి బిచ్చమ్ పెట్టే అలవాటు కూడా లేని నువ్వు మెగా బ్రదర్స్ ని అనే రేంజ్ కి వచ్చావా..నువ్వెంత నీ బ్రతుకెంత..పదవి లో ఉన్నావు కదా అని నోటికి ఏది పడితే అది వాగితే దవడ పళ్ళు రాళ్ళ కొడతాము అంటూ రోజా ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ తిడుతున్నారు అభిమానులు.
రోజా కామెంట్స్ పై నాగబాబు కూడా చాలా ఘాటుగా స్పందించాడు. సినిమా ప్రమోషన్స్ కోసం అనేక మీడియా సంస్థ లకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తనపై గతంలో విమర్శలు చేసిన రోజా కు ఘాటుగా రిప్లై ఇచ్చారు.తాజాగా చిరంజీవి కౌంటర్ ఇస్తూ నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది.
అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు.ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ చురకలు అంటించారు చిరు.