పవన్ అన్నని తిడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటారు, ఒక్కసారిగా ఎమోషనల్ అయిన చిరు.

ఒకప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే 3 సినిమాలు చేసారు మెగాస్టార్. ఇప్పుడూ అదే చేయాలని చూస్తున్నారు. అందుకే ఓ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే.. మరో సినిమాకు సై అనేస్తున్నారు. అయితే చిరంజీవి మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో న్యాయం కావాలి సినిమా క్లైమాక్స్ షూట్ అప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చారు. నేను సెట్ బయటకి వెళ్లి నిల్చున్నాను.

అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అంటే వెళ్ళాను. హాళ్ళో జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో పాటు శారద, జగ్గయ్య.. లాంటి సీనియర్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. అందరి ముందు నిర్మాత క్రాంతి కుమార్ నా మీద గట్టిగా అరిచారు నేను లోపలికి వెళ్ళగానే. నువ్వేమన్న సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నిన్ను ఇంకొకరు పిలవాలా? అంటూ అరిచాడు.

నేను బ్రేక్ ఇస్తేనే బయట నిల్చున్నా, పిలవగానే వచ్చాను దాంట్లో నా తప్పేమి లేకపోయినా అలా దాదాపు 200 మంది ముందు నా మీద అరవడంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యా. ఆ రోజు భోజనం కూడా తినాలనిపించలేదు. ఆ మాటలు నా మైండ్ లో బలంగా ఉండిపోయాయి. రాత్రికి ల్యాండ్ లైన్ కాల్ చేసి ఆయన మళ్ళీ దాని గురించి ఏదో రీజన్స్ చెప్తూ అరిచానని మాట్లాడారు.

కానీ అది నా మైండ్ లో ఉండిపోయి అవును నేను సూపర్ స్టార్ కాదు, కానీ అయి చూపిస్తా అని ఫిక్స్ అయ్యాను అని తెలిపారు. అలాంటివి తన లైఫ్ లో చాలా జరిగాయని, అన్ని జరగడం వల్లే నేను ఈ పొజిషన్ కి కసితో ఎదిగానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *