పొరపాటున సింగర్ ని అక్కడ పట్టుకున్న చిరంజీవి. వైరల్ అవుతున్న వీడియో.

దీపావళి పార్టీలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచింది. డ్యాన్స్ చేయాలంటూ తండ్రి చిరూను స్టేజీపైకి పిలిచారు రామ్ చరణ్. ఆ తర్వాత.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలోని టైటిల్ సాంగ్‍కు చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు. తన మార్క్ గ్రేస్ స్టెప్‍లతో అదరగొట్టారు.

సింగర్ రాజకుమారి పాట పాడుతుండగా.. మెగాస్టార్ అదిరిపోయే డ్యాన్స్ చేశారు. అయితే తాజాగా మెగాస్టార్ ఇంట్లో దివాళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా చిరు డాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీపావళి పార్టీలో చిరంజీవి ఓ రాప్ సింగర్ తో డాన్స్ చేశారు. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలోని పాటకు ఫుల్ జోష్ తో అదిరిపోయే గ్రేస్ తో స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ప్రముఖ ఇండియన్ ర్యాపర్ రాజకుమారి చిరుతో స్టెప్పులేసింది.

రాజకుమారి జవాన్ టైటిల్ సాంగ్ పాడుతుండగా దానికి చిరంజీవి తనదైన స్వాగ్ తో డాన్స్ చేశారు. మరో విశేషమేంటంటే తన తండ్రి డాన్స్ చేస్తుంటే రామ్ చరణ్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ మెగాస్టార్ డాన్స్ కి ఫిదా అయిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *