చిరంజీవి లైఫ్ ని కనక చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో చాలా సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే కొందరికి మాత్రం చిరంజీవి అంటే నచ్చదు ఎందుకంటే ఆయన వాళ్ల కంటే ఎక్కువ స్థాయి ఉన్న హీరో గా ఎదుగుతున్నాడు అనే ఈర్ష్య, అసూయా వల్ల వాళ్లు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే సింగర్, లిరిక్ రైటర్ కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి, సిల్క్ స్మిత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిల్క్ స్మిత స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సెట్ లో ఉన్న నన్ను పిలిచి మీరేమిటి ఇక్కడ అని అడగగా నేను కో డైరెక్టర్ నని చెప్పడంతో ఎక్కడో చూసినట్టుందే అని సిల్క్ స్మిత కామెంట్ చేశారని ఆయన తెలిపారు.
చిరంజీవి గారి సినిమాలో మనం కలిశాం కదా అంటే అవునని అన్నానని జయకుమార్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా బాగా ఆడిందా అని సిల్క్ స్మిత అడగగా అవునని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు. నా వల్లే ఆమెకు గతంలో మూవీ ఆఫర్ పోవడంతో ఆమె వ్యంగ్యంగా మాట్లాడిందని కనగాల జయకుమార్ అన్నారు. షూట్ జరుగుతున్న సినిమా సాంగ్ లిరిక్ వింటారా ఒక సీన్ ఉందని ఆమెకు చెప్పానని సీన్ వినిపించగా ఆ సీన్ ప్రకారం చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ అన్నారు.
ఆ సమయంలో చిరంజీవి కొడతాడా నన్ను అని సిల్క్ స్మిత అన్నదని కొట్టకుండా సీన్ తీయలేరా అంటూ నన్ను టీజ్ చేసిందని జయకుమార్ పేర్కొన్నారు. నన్ను సిల్క్ స్మిత టీజ్ చేసిందని చిరంజీవికి తెలిసి టేక్ లో చిరంజీవి నిజంగానే లాగి సిల్క్ స్మితను కొట్టారని ఆమె అమ్మో అని చతికిలపడిందని కనగాల జయకుమార్ అన్నారు. ముందురోజు దెబ్బ తిన్న సిల్క్ స్మిత రాత్రి 9 గంటల వరకు షూట్ ఉంటే ఆరు గంటలకే వెళ్లిపోతానని చెప్పిందని కనగాల జయకుమార్ అన్నారు. ఆరు గంటలకు పంపించకపోవడం వల్ల ఆమె ఆల్కహాల్ తాగిందని ఆయన తెలిపారు.