క్లీంకారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. క్లీంకార కోసం ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో.. క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారట. ఇక చరణ్ -ఉపాసనలు ఎక్కడికి వెళ్లినా వెంట పాపాయి క్లీంకార కూడా ఉంటుంది.
ఆమెని ప్రత్యేకంగా చూసుకునేందుకు ఓ ఫేమస్ కేర్ టేకర్ ని కూడా నియమించుకున్నట్లు కనిపిస్తుంది. చరణ్-ఉపాసన ఎక్కడికి వెళ్లినా నర్సు అవతారంలో ఆ పెద్దావిడ కూడా కనిపిస్తుంది. ఇంత కాలం ఆవిడ మీద ఫోకస్ పెట్టని మీడియా ఒక్కసారిగా ఫోకస్ పెట్టేసరికి చాలా వివరాలే వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పేరు సావిత్రి. కేర్ టేకర్ గా ఆమె ఎంతో ఫేమస్. గతంలో కరీనాకపూర్ కుమారుడు తైమూర్ అలీఖాన్ కి కేర్ టేకర్‌గా పనిచేసింది ఆవిడ.
ఓ ఇంటర్వ్యూలో కూడా కరీనా సావిత్రి గురించి చెప్పడం విశేషం. ఇప్పుడు క్లీంకార కోసం ఆమెని నియమించుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ దంపతులు ఆమెకు నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నారుట. ఆమెకంటూ ప్రత్యేకమైన వసుతులు..సౌకర్యాలు కూడా కల్పించినట్లు తెలుస్తోంది. అవి అదనం.