అన్నదానం, అనేది రెండు పదాలతో రూపొందించబడింది,’అన్నం’ అంటే ఆహారం, ‘దానం’ అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్నదానాన్ని వివిధ రకాల దానంలో ‘మహాదానం’ అంటారు.ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం. అయితే చరణ్ పుట్టినరోజు వేడుకలు రామ్ చరణ్ తల్లి సురేఖ.. అన్నదానం చేసి కొడుకు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.
గత కొన్నిరోజులుగా అపోలో హాస్పిటల్స్ లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్న ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు ఉపాసన కుటుంబసభ్యులు, అపోలో వర్కర్స్, పలువురు భక్తులు కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే సురేఖ కొణిదెల తన కొడుకు బర్త్ డేని కూడా నిర్వహించారు. పూజలో పాల్గొన్న 500 భక్తులకు రామ్ చరణ్ పేరిట.. సురేఖ అన్నదానం చేసారు.
‘అత్తమ్మస్ కిచెన్’ ద్వారా ఈ అన్నదానాన్ని నిర్వహించారు. ఉపాసన సహాయంతో సురేఖ ఇటీవలే.. ఈ అత్తమ్మస్ కిచెన్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. ఈ అన్నదానంతో చరణ్ బర్త్ డేని మాత్రమే కాదు, తమ బిజినెస్ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించేసారు. ఇక ఈ అన్నదానానికి సంబంధించిన వీడియోని అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.