చంద్ర మోహన్..గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. అయితే దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు చంద్రమోహన్.. గుండెపోటు కారణంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 50 సంవత్సరాలకు పైగా నట ప్రస్థానంలో 930కు పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌కు పేరు ప్రఖ్యాతలు బాగానే వచ్చాయి. అదే సమయంలో ఆయన ఎన్నో విలువైన ఆస్తులను సైతం కూడగట్టుకున్నారు. చంద్రమోహన్‌కు హైదరాబాద్‌తో పాటు చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడగట్టుకున్నారు.
ఈ క్రమంలోనే చెన్నై నగరంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అప్పుడు చాలా తక్కువ మొత్తం రేటుకే దాన్ని తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు వరకూ ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దిగ్గజ నటుడు చంద్రమోహన్‌కు ప్రస్తుతం రూ. 350 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఇద్దరు కూతుళ్లకు సమానంగా కొంత భాగాన్ని పంచేశారట. మిగిలిన ఆస్తులను మాత్రం తన పేరు మీదనే ఉంచుకున్నారని తెలిసింది. చంద్రమోహన్ ఆస్తులను తన తదనంతరం ఎవరికి దక్కేలా వీలునామా రాశారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.