సెక్షన్ 17-ఏపై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ” 17A రెట్రో యాక్టివ్ గా వర్తిస్తుంది. 17A కింద చంద్రబాబుకి రక్షణ కల్పించాలి. 17A కింద కచ్చితంగా అనుమతి తప్పనిసరి. ఎన్నికలు వస్తున్నాయని, ఫిక్స్ చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు. 17ఏ గనుక లేకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ పోతారు” అని హరీశ్ సాల్వే వాదించారు. అయితే సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకముందు కూడా చెల్లుబాటు అవుతుందని వాదించారు హరీశ్ సాల్వే. చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన 73 ఏళ్ల వయసు కలిగిన పెద్ద మనిషి అని, ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రి పొద్దుపోయాక విడిచిపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా రవీంద్రను పోలీసులు గృహనిర్భందం చేశారు. తన తల్లి వెంకట సౌభాగ్యవతి వర్ధంతి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, బంధువులు, సన్నిహితులనూ ఇంట్లోకి అనుమతించలేదని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం ఇంట్లోకి పాలుకూడా తీసుకెళ్లనివ్వలేదని, తన పీఏ, డ్రైవర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని రవీంద్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్రను గృహనిర్భందం చేయడం పట్ల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకుకూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అర్ధమవుతోందని అన్నారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నానని భువనేశ్వరి ట్వీట్ చేశారు.