రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ యాక్సిడెంట్ జరిగింది. 2017 అక్టోబర్ 9న రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని.. తన కారుతో ఢీకొట్టారు రాజశేఖర్. ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశారని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా జీవిత జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ఓ ఛానల్ లో ప్రసారం అయ్యే సంక్రాంతి ఈవెంట్ కి హాజరయ్యారు.
పండగ అంటే ఇట్టా ఉండాల అనే ఈవెంట్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయింది. యాంకర్ రవి, జీవిత రాజశేఖర్ ఇతర సభ్యలు కలసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ప్రోమోలో జీవిత రాజశేఖర్ బంధంపై ఇతర సభ్యులు చాలా సరదాగా కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎంత మంది అందగత్తెలు ఉన్నా రాజశేఖర్ మాత్రం జీవితనే ప్రేమిస్తారు అని ఓ వ్యక్తి అన్నారు. యాంకర్ రవి స్పందిస్తూ.. ఎందుకంటే అందరికంటే అందగత్తె జీవిత గారే అని సమాధానం ఇచ్చాడు.
దీనితో జీవిత పగలబడి నవ్వుకున్నారు. జీవిత గారు రాజశేఖర్ గారిని ఎక్కువ ప్రేమిస్తారా లేక రాజశేఖర్ గారు జీవిత గారిని ఎక్కువ ప్రేమిస్తారా అంటూ యాంకర్ రవి ఇరకాటంలో పెట్టారు. రాజశేఖర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా.. నేనే ఎక్కువ ప్రేమిస్తున్నా అని ఇప్పుడే నిరూపిస్తా అంటూ రాజశేఖర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆటపాటలతో ఈ షోలో జీవిత, రాజశేఖర్ చాలా హంగామా చేశారు. వేదికపై జీవిత, రాజశేఖర్ రొమాంటిక్ డ్యాన్స్ చేశారు.