షర్మిల..సీఎం జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేయడం.. పలు సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. కొన్ని కారణాలతో అన్నతో విభేదాలు తలెత్తి తెలంగాణలో వైఎస్సార్టీపీ ఏర్పాటు చేశారు. పాదయాత్రలు చేశారు. కానీ ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్నారు. షర్మిల పర్సనల్ విషయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ కు గతంలోనే పెళ్లయింది. షర్మిలకు కూడా ఇదివరకే ఒక వివాహం జరిగింది. వారిద్దరికీ ఇది రెండో పెళ్లి. వారి దాంపత్య జీవితంలో రాజారెడ్డి, అంజలి అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.
అయితే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ కొండా రాఘవరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే పలు కీలక విషయాలు చెప్పారు.”వైయస్ షర్మిలకు విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. పెళ్లి నుంచి రాజకీయాల వరకు అన్ని విషయాల్లో ఆమె వ్యవహార శైలి అలానే ఉంటుంది. అప్పట్లో ఆమె పార్టీ ప్రారంభించినప్పుడు నాయకులందరినీ ఏకవచనంతో సంబోధించేవారు. పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆమెకు తెలిసేది కాదు. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా తెలిసేది కాదు. చివరికి ఆమె భర్త అనిల్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు.
ఆమె ఇప్పటికీ హైదరాబాదులోని అంబర్ పేట లో నివాసం ఉంటోంది. ఆమె దగ్గరికి అనిల్ కుమార్ అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటారు. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ అనిల్ కుమార్ ను షర్మిల పెళ్లి చేసుకుంది. షర్మిలకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె అన్నిటినీ భరించాల్సి ఉంటుందని” రాఘవ రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, ఆ యూట్యూబ్ ఛానల్ లో రాఘవరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న స్క్రీన్ లో అనిల్ కుమార్ మొదటి భార్య, ఆమె కూతురు ఫోటో కనిపించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అటు వైసిపి అనుకూల నాయకులు, ఇటు కాంగ్రెస్ అనుకూల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కాగా, ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకే తెలియాలి.