2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం రావాలని షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సభలు , సమావేశాలు నిర్వహించారు. నాటి ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో 151 సీట్లల్లో గెలుపొంది ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు.
ఆ తరువాత కుటుంబంలో మనస్పర్థాలు రావడంతో షర్మిల జగన్‌కు దూరంగా ఉంటూ తెలంగాణలో వైస్సార్‌టీపీ పార్టీ పెట్టి ప్రచారం చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో రెండు నెలల క్రితం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనడానికి వైఎస్ షర్మిల సరైన నాయకురాలని భావించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది.