ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఎప్పుడో ఒకటి నటిస్తున్నారు. ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలో చాలామంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం కొత్త కోడలి పేరు ఐశ్వర్య. ఈమె ప్రముఖ డాక్టర్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పద్మజ వినయ్ కూతురు. ఐశ్వర్య కూడా డాక్టర్ విద్యనభ్యసించింది. అంటే బ్రహ్మానందం డాక్టర్‌ను తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నాడన్నమాట! ఎంగేజ్‌మెంట్ సమయంలో హాస్య బ్రహ్మ కొత్త కోడలికి బంగారు నెక్లెస్ ఇచ్చాడట. ఇది కొన్ని లక్షల ఖరీదు చేస్తుందని టాక్ నడుస్తోంది. బ్రహ్మానందం ఫ్యామిలీ..బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.
ఆయన పెద్ద కుమారుడు రాజా గౌతమ్ తండ్రి బాటలో నడుద్దామని ప్రయత్నించాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు, చారుశీల వంటి పలు చిత్రాల్లో కనిపించాడు. ఈయనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ బ్రహ్మానందం తన మనవళ్లతో ఆడుకున్న ఫోటోలను గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు గౌతమ్ విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.