బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన బ్యూటీ ‘తృప్తి దిమ్రీ’.

యానిమల్ రిలీజ్ కి ముందు తృప్తి ఫాలోవర్స్ కౌట్ 600K ఉండేది. ఇప్పుడు ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్ 3.2 మిలియన్ కి చేరుకుంది. అంటే కేవలం పది రోజుల్లో 6 లక్షల ఫాలోవర్స్ నుంచి 32 లక్షలకు చేరుకుంది. ఈ లెక్క ఇంకా పెరుగుతూనే వెళ్తుంది. ఇక ఈ అమ్మడికి వస్తున్న క్రేజ్ తో మేకర్స్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి దిమ్రీ అందాలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అయితే కొంతకాలం క్రితం తృప్తి, సామ్ ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కలిసి కనిపించారు. అప్పటినుంచి వీరి మధ్య అఫైర్ నడుస్తుందనే రూమర్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో గత నెలలో తృప్తి సామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసింది. అతడితో క్లోజ్‌గా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అని చెప్పింది. ఒక రెడ్ హార్ట్ ఎమోజీని కూడా జోడించింది. దాంతో వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఇప్పుడు సామ్ కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో “హ్యాపీయెస్ట్ బర్త్‌డే డియరెస్ట్ తృప్తి” అంటూ స్వీట్‌గా యానిమల్ యాక్ట్రెస్‌ను విష్ చేశాడు. అంతేకాదు, విషెస్ చివరన హగ్ ఇస్తున్నట్లు ఎమోజీ చేర్చాడు. సామ్ ఒక క్యూట్ ఫొటో షేర్ చేసి ఆమె పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ ఫొటో వారి మధ్య స్పష్టమైన సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది. ఈ ఫొటోలో తృప్తి చిరునవ్వుతో కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *