చాలా మంది జ్యోతిష్య కారణాల వల్ల ఇల కాలికి నల్లదారం కట్టుకుంటారు. ఇకపోతే, పిల్లల చేతులు, కాళ్లు, మెడ, నడుము చుట్టూ కూడా నల్ల దారం కడతారు. ఇదంతా ఎందుకు? ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా..? అని మీకు ఎప్పుడైనా సందేహం రావొచ్చు. కానీ, వాస్తవానికి కాలికి నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. అయితే శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. అందుకే.. కాళ్లకు నల్ల తాడు కట్టుకుంటే శని అనుగ్రహం ఉంటుందని చెబుతుంటారు.
ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని నమ్మకం. చెడు ప్రభావం పడకుండా ఉండేందుకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు పెద్దలు ఈ నల్ల తాడును కడుతుంటారు. ఇలా నల్ల తాడు కట్టుకుంటే ఆర్థి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెబుతుంటారు. అయితే నల్ల తాడు కట్టుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. మంగళవారం, శనివారం రోజునే కాలికి నల్ల తాడు కట్టుకోవాలి. ఈ రెండు రోజులు శని దేవునికి ఇష్టమైన రోజులని చెబుతుంటారు.
ఇలా చేస్తే ప్రశాంతత, సంతోషం లభిస్తుంది. పురుషులు కుడి కాలుకు, మహిళలు ఎడమ కాలికి నల్ల తాడు కట్టుకోవాలి. అటు, ఇటుగా కట్టుకోకూడదు. అయితే.. మేష, వృశ్చిక రాశి వారు కాళ్లకి నల్ల తాడు కట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారికి మంగళ గ్రహం అధిపతి. ఆయనకు నలుపు ఇష్టం ఉండదు. అందుకే నల్ల తాడును కాళ్లకు కట్టుకోకూడదని పండితులు అంటున్నారు. లేకపోతే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.