ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. మళ్లీ అమ్మాయిలకు నిరాశే..?

బాలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభం అయినప్పటి నుండి సర్వే చేస్తుంది. ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తుంది. లేటెస్ట్ సర్వేలో కొన్ని షాకింగ్ ఫలితాలు వచ్చాయి. అయితే సీజన్ 7లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే సీజన్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 7 ముగింపు పలకనున్నారు. హౌజ్‌లో టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఇప్పటికే ప్రియాంక, యావర్, అమర్, అర్జున్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరో ఫైనలిస్ట్ ప్లేస్ కోసం శివాజీ, ప్రశాంత్ మధ్య పోటీ నడుస్తుంది.

ఇందులో ప్రశాంత్ బయటిక వచ్చేసి.. శివాజీ ఫినాలేకు వెళ్లేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సారైనా అమ్మాయిలు గెలుస్తారేమో అనుకుంటే.. అది జరిగేలా కనిపించడం లేదు. ట్రెండ్స్ ప్రకారం ఈ సారి కూడా టైటిల్ కచ్చితంగా అబ్బాయిలు గెలుస్తారని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా శోభా శెట్టిపై ముందు నుంచి అంచనాలు బాగానే ఉండేవి. కానీ చివరి రెండు వారాలుగా ఆమె చేసిన ఓవర్ యాక్షన్ కారణంగానే బయటికి వచ్చేసిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయిప్పుడు. ముఖ్యంగా తను డిస్టర్బ్ అవ్వడమే కాదు.. ఇంట్లో అందర్నీ డిస్టర్బ్ చేసింది ఈ భామ. అందుకే శోభా శెట్టిని ఫైనల్ కంటే ముందుగానే ఇంటికి పంపించారు ఆడియన్స్.

ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే మాత్రం కచ్చితంగా అమర్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్జున్ గ్రాఫ్ కూడా చాలా బాగా ఉంది కానీ మొదటి 5 వారాలు ఆయన ఇంట్లో లేడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే ఒక్క కారణంతోనే విన్నర్ చైర్‌కు దూరంగా ఉండిపోతున్నాడు. మిగిలిన వాళ్లలో యావర్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక అంతా ఫినాలేతోనే సరిపట్టుకుంటున్నారు. ఇదే గానీ జరిగితే మరోసారి అమ్మాయిలకు బిగ్ బాస్ హ్యాండిచ్చినట్లే. ఏదేమైనా మరో రెండు వారాల్లో విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *