బిగ్ బాస్ అంబటి అర్జున్, అమర్ దీప్ లను కాకుండా.. మిగతా ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలుస్తారు. బిగ్ బాస్ పిలవడంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్లు.. గదిలోకి రాగానే తెగ ఎగ్జైట్ అయిపోతారు. అద్భుతమైన ఆహార పదార్థాలను డైనింగ్ డేబుల్ పై ఉంచడం చూసిన హౌస్ మేట్స్ ఫుల్ ఖుషీ అవుతారు. మీ అందరి కోసం బిగ్ బాస్ ఈరోజు లంచ్ పార్టీ ఏర్పాటు చేశారని.. ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని చెబుతారు. అయితే రోజూ చప్పిడి కూరలు తింటున్న హౌస్ మేట్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. చికెన్ బిర్యానీతో గ్రాండ్ గా లంచ్ పార్టీ ఏర్పాటు చేశాడు.
కాగా అర్జున్, అమర్ దీప్ మినహా మిగిలిన వాళ్ళంతా యాక్టివిటీ రూంలో కి రావాలని బిగ్ బాస్ చెప్పారు. లోపలికి వెళ్ళేసరికి అదిరిపోయే విందు ఏర్పాటు చేశాడు. మిసెస్ బిగ్ బాస్ .. మీ అందరి కోసం లంచ్ ఏర్పాటు చేసింది. ఇక తినండి అని బిగ్ బాస్ చెప్పడంతో.. ‘ పెద్దయ్యా ఇందులో పేచీ ఏం లేదు కదా .. అని అడిగింది రతిక. అర్జున్, అమర్ దీప్ మీ ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని యాక్టివిటీ రూంకి ఎందుకు పిలిచానని ఆలోచిస్తున్నారా .. అందుకు ఒక కారణం ఉంది అని బిగ్ బాస్ చెప్పాడు. తినడం వలన ఏదైనా ఇబ్బంది ఉందా అని రతిక బిర్యానీ తినడానికి సంశయిస్తుంది. రతిక మీరు ఓవర్ థింకింగ్ ఇంకా ఆపలేదా అంటూ బిగ్ బాస్ జోక్ వేశారు. ఇక బిగ్ బాస్ పంపిన బిర్యానీ తిన్నారు హౌస్ మేట్స్.

ఇంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో దారుణమైన హత్య జరిగింది. చనిపోయింది ఎవరో కాదు మిసెస్ బిగ్ బాస్ అంటూ షాక్ ఇచ్చాడు. ఆ నేరస్థుడిని పట్టుకోవడానికి అర్జున్, అమర్ దీప్ పోలీస్ గెటప్ లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని చూసి నిజంగానే పోలీసులు అనుకోని ప్రశాంత్ డోర్ తీసి భయపడి పరుగెత్త బోయాడు. ఖిల్ ఖిల్ ఖిల్ .. ఖిలాడీ అంటూ బ్యాక్ రౌండ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు అర్జున్, అమర్ దీప్. అయితే కంటెస్టెంట్స్ ఊహించిన విధంగానే కడుపు నిండా తిండి తిండి పెట్టి .. ఇంతలోనే దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఈ టాస్క్ సారాంశం ఏమిటో తెలియదు. కేవలం ఎంటర్టైన్మెంట్ లో భాగం అని తెలుస్తుంది. ఇలా ఎపిసోడ్ ముగిసింది.