తాజాగా బిగ్‌బాస్-7కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కినేని అందగాడు నాగార్జున సంభాషణతో రూపొందిన ప్రోమో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బిగ్‌బాస్ 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించగా ఏడో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్ చేస్తారని తాజాగా విడుదలైన ప్రోమోతో చెప్పేశారు.. అయితే హిందీలో బిగ్‌బాస్ పేరిట షో ప్రారంభించగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. దీంతో వరుసగా 16 సీజన్లు విజయవంతంగా రన్ చేశారు. ఓటీటీల వాడకం పెరిగిపోవడంతో ఓటీటీలోనూ బిగ్‌బాస్ షో అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలాగే బిగ్‌బాస్ వివిధ భాషలకు సైతం పాకింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటిదాకా ఆరు సీజన్లు వచ్చాయి. వీటికి అదనంగా ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కూడా ప్రసారమైంది. ఇప్పుడు ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. త్వరలో బిగ్‌బాస్ 7 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ ప్రారంభంలో షో గ్రాండ్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షో మేకర్స్ చాలామంది సెలబ్రిటీలను సంప్రదించారు. ఇందులో కొందరు హౌస్‌లోకి రావాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం ఫైనల్ లిస్టులో ఎలాగైనా చోటు కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు.
ఇక ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిలో బుల్లితెర నటి శోభా శెట్టి, యూట్యూబర్, నటి శ్వేతా నాయుడు, సింగర్స్ సాకేత్, మోహన భోగరాజు, సీనియర్ నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమర్‌దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి, జర్నలిస్టు సురేశ్, జబర్దస్త్ బ్యూటీ వర్ష, బ్యాంకాక్ పిల్ల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివర్లో హ్యాండ్ ఇచ్చినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.