బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్, హౌస్ నుంచి ఒకేసారి ఇ‍ద్దరు లేడీ కంటేస్టంట్స్ అవుట్.

బిగ్ బాస్ తెలుగు పదకొండో వారం నామినేషన్లలో అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ,, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరిలో ఓటింగ్ నిర్వహించిన రోజు నుంచి ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి మొదటి రెండు స్థానాల్లో ఉంటూ వచ్చారు. చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి ఉన్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌసులో 8 మంది నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కాబట్టి అతడు లిస్టులో లేడు.

రైతుబిడ్డ ప్రశాంత్‌కి ఒక్క ఓటు పడటంతో అతడు సేఫ్ అయిపోయాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ అంటే అమర్‌దీప్, యావర్, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక ఉన్నారు. వీళ్లలో యావర్‌కి ఈసారి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. రెండులో అమర్ ఉన్నాడట. తర్వాత వరసగా రతిక, అశ్విని, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సీరియల్ బ్యాచ్‌లోని ప్రియాంక లేదా శోభాశెట్టిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. కానీ బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ అస్సలు వీళ్లని బయటకు పంపించారు. ఎందుకంటే ఆటైనా గొడవైనా వీళ్లిద్దరూ ముందుంటున్నారు.

శివాజీకి ఎదురు నిలబడి మాట్లాడుతున్నది కూడా వీళ్లే. ఇలాంటోళ్లని ఎలిమినేట్ చేసి పంపించేస్తే షోలో మజా పోతుంది. అందుకే ఓట్లు తక్కువ పడినా సరే వీళ్లు బయటకెళ్లే ప్రసక్తే లేదనిపిస్తోంది. ఈ వారం ఎవిక్షన్ పాస్ ఇవ్వడాని కంటే ముందు.. ఇప్పటివరకు హౌసులో ఉన్నదాని ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం నిలబడమని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వరసగా శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా, అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిల్చున్నారు. చివరి రెండు స్థానాల్లో అశ్విని-రతిక ఉన్నారు. అంటే వీళ్లిద్దరూ ఎలిమినేషన్ కి అర్హులని పరోక్షంగా చెప్పినట్లే. అలా ఇప్పుడు ఈ ఇద్దరిని ఈవారం ఒకేసారి ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ప్లానింగ్‌లో ఉందని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *