8 ఏళ్ల బాలికతో వీడియోలు, బిగ్ బాస్ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.

కన్నడ బిగ్ బాస్ లో కనిపించి పాపులారిటీని సొంతం చేసుకున్న నటి సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె అరెస్ట్‌ కి గల కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు నెట్టింట ఆమె పేరు తో జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే కన్నడ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 కంటెస్టెంట్ సోనూ శ్రీనివాస్ గౌడ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

బిడ్డను చట్టబద్దంగా దత్తత తసుకోకుండా అక్రమంగా దత్తత తీసుకోవడమే అరెస్ట్ కి కారణం అని తెలుస్తుంది. సాధారణంగా పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ సోనూ శ్రీనివాస్ మాత్రం ఏ ఒక్క రూల్ పాటించలేదని ఆమెపై అభియోగం మోపబడింది. బైదరహళ్లిలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని బైదరహళ్లి గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇటీవల సోను శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియాలో సెవంత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై రక రకాలుగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ఈ మధ్య కొంతమంది నటీనటులు సింపతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ దత్తత ప్రక్రియ చట్టవిరుద్దమని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే9 రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి గీత బైదరహళ్లి పోలీస్ స్టేషన్ లో జేజే చట్టం కింద ఫిర్యాదు చేశారు.

చైల్డ్ వెల్ఫేర్ సమక్షంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో పిల్లలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. హిందూ దత్తత చట్టం, 1956 ప్రకారం దత్తత ప్రక్రియ జరగలేదు. కానీ సోను ఆ పని చేయలేదు.. సోషల్ మీడియాలో పాపతో ఫోటోలు షేర్ చేయడంపై ఈ వివాదం మొదలైంది. ఇలా ఎన్నో ఫిర్యాదులు ఆమెపై వచ్చాయి. ఈ పథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *