బీనా ఆంటీ మళ్లీ వచ్చేస్తుందిరోయ్..! ఈ సారి ఎలా ఉండబోతుందో తెలుసా..?

మీర్జాపూర్ సిరీస్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా, బీనా ఆంటీ ఈ పేర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ సిరీస్ ఫేమస్ అయ్యింది. 2018 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9 ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. బూతు పదాలు, ఘాటు రొమాన్స్ తో అప్పట్లో పెను సంచలాన్ని సృష్టించిన సిరీస్ అంటే ఇదే.

ఇక ఈ సిరీస్ లో బీనా ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే మూడేళ్లుగా వెయిటింగ్..2018లో ‘మీర్జాపుర్’ తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్‪లో విడుదలైంది. తొమ్మిది ఎపిసోడ్లలో ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. 2020లో 10 ఎపిసోడ్లతో రెండో సీజన్ వచ్చింది. దీనికి కూడా మొదటి దానికి మించిన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

బీనా ఆంటీ డబ్బింగ్.. ఈ సిరీస్ లో మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా పాత‍్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న రోల్ అంటే బీనా అంటీదే. ఈమెది ఖాలీన్ భయ్యాకు రెండో భార్య పాత్ర. ఒకటి, రెండు సీజన్లలో ఈమె పాత్రకు స్కోప్ తక్కువే. కానీ మూడో సీజన్ లో మాత్రం ఎక్కువే ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పోస్ట్ చేసి.. త్వరలోనే సీజన్ 3 రిలీజ్ అవుతుందనే హింట్ ఇచ్చేసింది. దీంతో ‘మీర్జాపుర్’ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *