శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ, అసితాంగ భేరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోథ బైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఈ ఇస్సన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు. అయితే ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం.
ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలస్వరూపం తెలిసినవాడు, ఇంకా సంతానభాగ్యం పొందడానికి, వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు.బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.