కేసీఆర్ ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. అయితే సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన నేతలు ఎన్నికల బరిలో నిలబడతారు. వారికి పోటీగా స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన వారే ఉంటారు. అయితే మొదటిసారిగా ఒక సామాన్యురాలు..యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన యువతి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడింది.
నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తాను పోటీ చేస్తున్నా అంటూ ప్రచారం చేసింది. ఆమెకు వివిధ వర్గాల నుంచి మంచి మద్దతు కూడా లభించింది. మొత్తానికి తన నామినేషన్ తో దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది బర్రెలక్క. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా ప్రచారం చేసింది. ఉదయం కొల్లాపూర్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజిల్ గుర్తుతో ఎన్నికల బరిలో దిగిన శిరీష తొలిరౌండ్ లో 473 ఓట్లు కౌంట్ తో ముందంజలో ఉండటంతో అందరి చూపు ఆమెపై పడింది.
కానీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.. రెండో రౌండ్ లో ఆమె కేవలం 262 ఓట్లకే పరిమితం అయ్యింది. మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కేవలం 1000 ఓట్ల లోపు ఓట్లకే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి 9,797 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఆయన గెలుపు ఖాయం అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.