ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేద కుటుంబం నుంచి స్వచ్ఛందంగా బరిలో నిలబడిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వైపు అందరూ చూస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలబడిన..
ఆమె తన అఫిడవిట్‌లో చరాస్తులు కేవలం 6,500 అని పేర్కొంది. బయటికి కనిపించని పొలిటికల్ స్ట్రాటజీ ఏమీ లేని, సాదాసీదా ఆడపిల్ల అని ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వస్తున్నది. కొందరు ఆర్థికంగానూ సహకరిస్తున్నారు. నేటి వ్యవస్థలో ఇంత సాదాసీదాగా ఎన్నికల్లో ఒకరు పోటీ చేయడం, అందుకు ఇంత పెద్ద మద్దతు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి..
సంశయానికి గురి చేస్తున్నది. ఒకరు ఎన్నికల బరిలో నిలబడాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడి తప్పనిసరి అని, బయటికి కనిపించని మరో అంతర్గత వ్యూహం ఉండి తీరుతుందని చాలా మంది భావిస్తారు.