బర్రెలక్క కాబోయే భర్తను చూశారా..? పెళ్లి తేదీ ఎప్పుడంటే..!

బర్రెలక్క..అసలు పేరు శిరీష. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం. శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శిరీష. ఆమె డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. కానీ నోటిఫికేషన్లు ఆలస్యమవడం..వచ్చినా కోర్టు కేసుల వల్ల వాయిదా పడుతుండడంతో.. ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టారు శిరీష. హాయ్ ఫ్రెండ్స్.. ఉన్నత చదువులు చదివితే డిగ్రీలు వస్తున్నాయే తప్ప.. ఉద్యోగం రావడం లేదని.. అందుకే తన తల్లి కొనిచ్చిన బర్రెలను తోలుకుంటున్నారంటూ వీడియో పోస్ట్ చేశారు. శిరీష్ పెట్టిన ఆ వీడియో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచీ ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చిన్న వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి తేదీతోపాటు.. కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది.

అలాగే పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్ స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలక్కకు కాబోయే భర్త పేరు వెంకటేశ్.. అతడి ఇన్ స్టా ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా.. మరే వివరాలు కనిపించలేదు. ప్రస్తుతం బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. బర్రెలక్క తల్లి రోజూ కూలీ. ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది కర్నె శీరిష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *