కేటీఆర్ కి బండ్ల గణేష్ దిమ్మతిరిగే కౌంటర్, KTR ని బొక్కలో వేసే వాళ్ళం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. సీపీఎం మద్దతుతో మొత్తం 65 మంది శాసన సభ్యులతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్వల్ప సీట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఇంకా బయటికి రాలేదు.

తుంటికి సర్జరీ కావడంతో ఇంకా ఆయన అసెంబ్లీకి రాలేదు.. ప్రజలనూ కలువలేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ ఎంట్రీని గ్రాండ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నది. లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నది. బండ్ల గణేష్ మాట్లాడుతున్న వీడియో చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం పోస్టు ఖాళీగా లేదని వివరించారు.

మళ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా ఐదేళ్లు పడుతుందని అన్నారు. ఆ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందులో తమకు ఏమాత్రం సందేహం లేదని పేర్కొన్నారు. కాబట్టి, అర్జంట్‌గా సీఎం అయిపోవాలని, ఇతర పదవులను చేపట్టాలని ఆతృతపడితే.. వేరే రాష్ట్రాల్లో ఆ ప్రయత్నాలు చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *