మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం..! 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 63 ఏళ్ల వృద్ధుడు.

ఎక్కడ బాల్యవివాహాలు మాత్రం ఆగడం లేదు ఇంకా 18 ఏళ్ల వయసు కూడా నిండకముందే ఎంతో మంది తల్లిదండ్రులు ఏకంగా తమ కూతుర్లకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కూతుర్లను భారంగా అని భావిస్తూ.. గుండె మీద బరువు అనుకుంటున్న తల్లిదండ్రులు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు అయితే సోషల్ మీడియాలో అనునిత్యం అనేక రకాలైన పెళ్లి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వెడ్డింగ్‌ వేడుకలకు సంబందించినవి కాగా, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి.

అయితే, కొన్ని అసాధారణ వివాహాలకు సంబంధించిన విషయాలు కూడా మనం అపుడపుడూ చూస్తుంటాం. ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది. వైరల్‌ అవుతున్న వీడియోలో వధూవరుల మధ్య వయస్సులో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.పశ్చిమాఫ్రికాలోని ఘనాలో 62 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉదంతం ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ పెళ్లి గురించి విని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో 63 ఏళ్ల వృద్ధుడు, నుమో బోర్కెట్ లావే త్సురు అనే 12 ఏళ్ల బాలికని వివాహం చేసుకొని వార్తల్లోకెక్కాడు. అమ్మాయికి 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ వివాహం నిశ్చయించబడిందని వినికిడి. క్రోవర్‌లోని నంగువాలో సంప్రదాయ వేడుకగా ఈ వివాహం జరిగింది. వివాహానికి హాజరైన మహిళలు 12 ఏళ్ల బాలికను పెళ్లికి సిద్ధం చేసినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.

కాగా ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. అంతేకాదండోయ్, సదరు వివాహానికి పెద్ద ఎత్తులో జనం హాజరైనట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ పెళ్లి గురించిన విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *