ఆ స్టార్ హీరో నన్ను రూమ్‌కు రమ్మన్నాడు..! సీనియర్ న‌టి సంచలన వ్యాఖ్య‌లు.

బాలకృష్ణపై ఓ తమిళ నటి తీవ్ర ఆరోపణలు చేసింది. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గోన్న నటి విచిత్ర మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఓ ఘటన తనను సినిమా నుండి తప్పుకునేలా చేసిందని తెలిపింది. ఆ కాస్టింగ్ కౌచ్ అనుభవంతో ఇక సినిమాల్లో నటించడం ఆపేశానని పేర్కోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సీనియర్ నటి విచిత్ర ప్రస్తుతం త‌మిళ‌ బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్‌గా ఉంది. అయితే నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు.

దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ..”2001 సంవత్సరంలో నేను వేరే భాషలో ఒక సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జ‌రిగింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాను. పార్టీ ముగిసిన అనంత‌రం సినిమా హీరో నా దగ్గ‌ర‌కు వ‌చ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు.

తరువాతి నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటినుంచి తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ త‌రువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. అయితే ఈ వీడియోలో బాల‌య్య పేరును విచిత్ర‌ ఎక్కడ వెల్ల‌డించ‌లేదు. కానీ ఆ సమయంలో విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం తెలుగులోనే. అది కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ . ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్‌లుగా న‌టించ‌గా న‌టి విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది.

ఆ సినిమా 2001లో వచ్చింది.. దీంతో నటి విచిత్ర చెప్పింది బాలయ్య గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *