ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 వరకు సమావేశాలు జరపాలని సభా వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయించారు. స్పీకర్ అధ్యక్షతన BAC సమావేశం జరిగింది. విపక్షం టీడీపీ ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ శని, ఆదివారం సభకు విరామం ఉంటుంది. రేపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు .. చంద్రబాబును జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అంతా సక్రమంగా జరిగిందని గతంలో కోర్టు కూడా చెప్పిందని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.
ఇలాంటి సంక్షోభాలు గతంలో చాలా చూసామని.. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు.. వ్యవస్థలపై విప్లవం రావాలంటూ బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. అమరావతి ఉద్యమంలో జూనియర్ ఆర్టిస్టులు వస్తే.. విశాఖ పెట్టుబడుల సదస్సుకు వచ్చిన వారు ఎవరు? అంటూ బాలకృష్ణ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.