అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీసాలు మిలేయడం, తొడగట్టడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.. ఇక, మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. అయితే ఇవాళ్టి అసెంబ్లీ సెషన్స్. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఆ తర్వాత.. సమయం ఉదయం 9.05 గంటలు.. చంద్రబాబు కేసుపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. యాజ్ యూజ్‌వల్‌గా స్పీకర్ టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.
సమయం ఉదయం 9:09 గంటలు.. ప్రశ్నోత్తరాలు మధ్యలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమయం 9.20 గంటలు.. సభలో గందరగోళం మరింత పెరిగింది. టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని మంత్రి బుగ్గన ప్రకటించారు. అయినా టీడీపీ శాంతించలేదు. సమయం 9.25గంటలు.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. స్పీకర్ వారించినా వెనక్కి తగ్గలేదు. కానీ అంతలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పి ఏదో సంజ్ఞ చేసారంటూ వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. బాలకృష్ణ, టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
మీసాలు రోషాలు.. తొడలు అంటూ టిక్ భాషలో అంబటి మార్కు స్టైల్లో టీడీపీపై పంచ్‌ల వర్షం కురిపించారు. సమయం 9:32గంటలు.. టీడీపీ సభ్యులు ఏమాత్రం తగ్గేలేదు. తమ ఆందోళను కంటిన్యూ చేస్తూ స్పీకర్ చుట్టూ నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పీకర్ మానిటర్‌ను డ్యామేజ్ చేస్తున్నట్లు.. టీడీపీ సభ్యులు బల్లలు చరుస్తూ.. సభను అవమానిస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పే ప్రయత్నం చేస్తూ.. టీడీపీ సభ్యులకు మరోసారి తిరగ మోతపెట్టారు.
సమయం 9.36గంటలు.. సభ జరిగే పరిస్థితులు లేకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సమయం 10గంటలు.. ఇది జరిగిన కాసేపటికి అంటే సరిగ్గా పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇక్కడా అసెంబ్లీలో సీన్స్ మళ్లీ రిపీట్ అయ్యాయి. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వడం చైర్మన్ తిరస్కరించడం.. ప్రశ్నోత్తరాలు ప్రారంభించడం వెంటవెంటనే జరిగాయి. ఆ వెంటనే టీడీపీ సభ్యుల నినాదాలు ప్రారంభమయ్యాయి.