శ్రీరాముని బాల్యరూపంలోని ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. రాముడి విగ్రహం చుట్టూ విష్ణు మూర్తి దశావతారాలు ఉన్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నాడు.
తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. రాముడు విష్ణు మూర్తి ఏడో అవతారంగా చెప్తారు. అయితే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంప్రోక్షణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఆలయ అధికారులు గర్భ గుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే గురువారం గర్భగుడి లోపల విగ్రహం ఉంచిన ఫొటోలు విడుదల కాగా..
ఆ విగ్రహం తలపై పసుపు గుడ్డ కప్పి ఉంచారు. ఈ రోజు ఉదయం విగ్రహం కళ్ళు మాత్రమే కప్పబడిన మరో చిత్రం బయటపడింది. పూర్తి రూపాన్ని చివరకు మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ విగ్రహం బాల రాముడి ముఖంతో పాటు బంగారు విల్లు, బాణాన్ని పట్టుకున్నట్లు చూపిస్తోంది.