చంద్రబాబు.. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. టీడీపీ-జనసేన జైత్ర యాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగున్నర ఏళ్లలో సమాజంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. మరోవైపు.. పెట్రోల్, కరెంట్ ధరలు పెంచారు.. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అని విమర్శించారు.
ఇదిలాఉంటే.. మీటింగ్ పెట్టుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే విజిలెన్స్ ను పంపించాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆక్వా రంగాన్ని టీడీపీ అభివృద్ధి చేస్తే.. వైసీపీ వాళ్ళు సాగు ఖర్చు మూడు రెట్లు పెరిగేలా చేసి ఆక్వా రంగాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. పండించిన పంట తరలించేందుకు గోనె సంచులు సైతం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు.