భోగి మంటల కార్యక్రమం తరువాత సభ ఏర్పాటు చేశారు. ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు. ఒక పక్క బాధ,ఒక పక్క కోపం ఉందన్నారు. భవిష్యత్యులో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. అయితే భోగి పండుగకు ముందురోజు..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 3న్నర గంటలపాటూ భేటీ అయ్యి.. చాలా విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ప్రధానంగా టీడీపీ ఆల్రెడీ 6 గ్యారెంటీ హామీలు, జనసేన షణుఖ వ్యూహంలోని 6 అంశాలపై చర్చించారని తెలిసింది.
ఇలా మొత్తం 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి ఈ మేనిఫెస్టోని ప్రకటించేసి, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం జనవరి 18 లేదా 21న తిరుపతి లేదా ఇంకెక్కడైనా భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, మేనిఫెస్టోని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.