జైల్లో చంద్రబాబుకు పెట్టిన టిఫిన్, భోజనం ఏంటో తెలుసా..?

చంద్రబాబు ఎప్పుడూ సమయానికి భోజనం చేస్తారు. అదే ఆయన ఫిట్‌నెస్ కు కారణమని చెబుతారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చన్న న్యాయమూర్తి ఆదేశాలతో ఆయన భద్రతా సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని చంద్రబాబు కోసం తెచ్చారు. పుల్కాలతో పాటు వెజ్ కర్రీ, సలాడ్, ఫ్రూట్ బౌల్, మజ్జిగ, హాట్ వాటర్ ను తీసుకు వచ్చారు. జైలు అధికారులు పరీక్షించిన తర్వాత వాటిని చంద్రబాబుకు అందించనున్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు తొలిరోజు భోజనంపై అప్డేట్ బయటకు వచ్చింది.

ఈయన మాజీ సీఎం కావడం.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కావడంతో ఒక గది, ఇంటి భోజనం అనుమతి కోరగా.. కోర్టు ఓకే చెప్పింది. దీంతో చంద్రబాబుకు ఉదయం టిఫిన్ పంపించారు. ఈ మధ్యాహ్నం భోజనం కూడా ఇంటినుంచే వెళ్లింది. ఈ ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లిన సిబ్బంది.. ఈ మధ్యాహ్నం చంద్రబాబుకు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో అది కూడా కుటుంబ సభ్యులు వండడంతో తీసుకెళ్లారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడినీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు. ఇక మధ్యాహ్నం భోజనంలోకి బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీరు కూర, పెరుగు ను ఇంటి నుంచి తయారు చేసి చంద్రబాబు కోసం పంపించారు.

మధ్యాహ్నం మూడు గంటలకు టీ తాగేందుకు వేడి నీళ్లు పంపిన కుటుంబ సభ్యులు దాన్ని మధ్యాహ్న భోజనంతోనే పంపారు. రాజమండ్రి రూరల్ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి చంద్రబాబుకు భోజనం పంపించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యే ఇంటి నుంచే చంద్రబాబు కు సప్లై చేస్తున్నారు. చంద్రబాబు ఒక సీఎంగా ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ఇప్పుడు జైలు పాలు కావడం సంచలనమైంది. ప్రతీకార రాజకీయంతో జగన్, చంద్రబాబుల వైరాలకు ఇప్పుడు ఇరువురూ ఒకసారి జైలుకు వెళ్లి ఆ ముచ్చట తీర్చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *