CID కస్టడీలో చంద్రబాబువిచారణ, బిత్తరపోయిన CID అధికారులు.

రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ జరిపారు. ఉదయం దాదాపు గంటన్నర ప్రశ్నల తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు.. మొత్తం మీద నాలుగు సార్లు బ్రేకులు ఇచ్చినట్లు సమాచారం. 120 ప్రశ్నలు సంధించాలని వెళ్లిన సీఐడీ.. ఇవాళ కేవలం 50 ప్రశ్నలు మాత్రమే సంధించింది. వీటిలో సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించింది. అయితే ఈ స్కాంలో మొత్తం రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందనీ… అందులో GST తీసేయగా.. రూ.301 కోట్లు మనీ ఉంటుందనీ.. అందులో 60 కోట్ల రూపాయలు నిజంగానే స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చెయ్యగా… మిగతా రూ.241 కోట్లకు సంబంధించి లెక్క తేలాల్సి ఉందని అధికారులు చంద్రబాబుకి చెప్పినట్లు తెలిసింది. ప్రధానంగా 10 ప్రశ్నలను ముందుగా వేసినట్లు తెలిసింది.

అవి.. మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత? ఈ ప్రాజెక్టు విలువ గుజరాత్ కంటే ఏపీలో ఎక్కువగా ఎందుకు ఉంది? కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సబ్ కాంట్రాక్టులను ఎలా ఇచ్చారు? నిధుల విడుదలకు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా? ఈ ఫైల్ లోని 13 సంతకాలు మీరే చేశారా? 2018లో కేంద్ర ఆదాయ పన్ను శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో లోపాలు ఉన్నాయని మీకు లేఖ రాసిందా? ఆ లేఖను మీరు ఎందుకు పట్టించుకోలేదు? సీమెన్స్‌తో మీకు సంబంధం ఉందా? ముందుగా జారీ చేసిన జీవోకీ, సీమెన్స్‌తో చేసుకున్న ఒప్పందానికీ మధ్య తేడా ఎందుకుంది? వంటి ప్రశ్నలను అడిగినట్లు తెలిసింది.ఆయా ప్రశ్నలకు చంద్రబాబు చెప్పే సమాధానాల ఆధారంగా సీఐడీ అధికారులు మరిన్ని ప్రశ్నలు వరుసగా వేసినట్లు తెలిసింది.

చంద్రబాబు చెప్పిన సమాధానాలను బట్టి.. మధ్యమధ్యలో అధికారులు.. తాము విడిది చేసిన R&B ఆఫీస్ నుంచి కొన్ని ఆధార పత్రాలను కూడా తెప్పించుకున్నారని సమాచారం. నిన్న చంద్రబాబు చెప్పిన సమాధానాలను బట్టి… అధికారులు కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇవాళ చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తారని సమాచారం. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలను బట్టీ.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీ లోకి తీసుకోవాలా లేక, ఇక్కడితో విచారణ సరిపోతుందా అనేది నేటి సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరే ఛాన్స్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *