తెలుగు దేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ పైన సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సీనీ నటుడు సుమన్ స్పందించారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని అన్నారు. ఆయన లోపల ఉండటం చాలా బాధాకరమన్నారు. బాబు పొలిటికల్ ప్రిసనర్ కాదని తెలిపారు. బాబు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నానన్నారు. పాలిటిక్స్‌లో ఇది ఒక పెద్ద గుణపాఠమని పేర్కొన్నారు.
తాను టైంను బాగా నమ్ముతానని.. బాబు టైం బాలేదని.. ఎవరు ఎంత ప్రయత్నించినా టైం బాగుంటే ఆయనే బయటికి వస్తారని చెప్పుకొచ్చారు. ఆయన తప్పకుండా బయటకు వస్తారని తెలిపారు. ‘‘మా స్టాఫ్ తప్పు చేసిన అది మా పైకే వస్తుంది అలాగే ఆయనకి తెలుసో తెలియకుండానే అది తప్పు జరిగి ఉండొచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం మామూలు విషయం కాదు అన్ని ఆలోచించే చేసుంటారని సుమన్ పేర్కొన్నారు.