సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. కోట్లాది మంది రామ భక్తుల సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే యావత్ భారతం ఎంతో కాలంగా ఎదురు చూసిన అపూర్వ ఘట్టం ఈరోజు ఆవిష్కృతమయింది.
అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షించారు. అందరూ తమ ఇళ్లలో, ఆలయాలలో పూజలు నిర్వహించారు. సినీ నటి మంచు లక్ష్మి కూడా తన ఇంట్లోనే బాల రాముడికి పూజలు చేశారు.
అయోధ్య వేడుకను ల్యాప్ టాప్ లో లైవ్ లో తిలకిస్తూ, బాల రాముడికి పూజలు చేశారు. ఈ వీడియోను ఆమె ఎక్స్ వేదికగా ద్వారా షేర్ చేశారు. ఈరోజుకు మార్గం సుగమం చేసిన ప్రతి హిందూ యోధుడికి కృతజ్ఞతలు ప్రతిధ్వనిస్తున్నాయని ఈ సందర్భంగా మంచు లక్ష్మి అన్నారు. 7 వేల సంవత్సరాలకు పైగా ఉన్న రాముడి శాశ్వతమైన ఉనికి భక్తిని ప్రేరేపిస్తూనే ఉందని చెప్పారు. ఈ దైవిక వారసత్వం మన దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని అన్నారు.
Gratitude echoes for every Hindu warrior who paved the path to today. The timeless presence of Ram, spanning over 7000 years, continues to inspire awe and reverence. May the divine essence of this legacy bind our nation in unity.#RamMandirAyodhya #JaiShreeRam #RamLalla pic.twitter.com/dCOPCyDfDo
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 22, 2024