గ్రాండ్ టెంపుల్‌లో రామ్‌లల్లా ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని వర్గాల ప్రముఖులు హాజరవుతున్నారు. దేశం నలుమూలల నుండి ఎంపిక చేయబడిన పూజారులచే ఈ వేడుక నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో పూజారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవంఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం.
ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్‌లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం.
ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.