అవయవాలు విఫలమైన సందర్భాల్లో, వాటిని చికిత్సతో చక్కదిద్దే ప్రయత్నాలు విఫలమైనప్పుడు, రోగి పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఇతర వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించి, రోగి శరీరంలో ప్రవేశ పెట్టవలసి వస్తుంది. అయితే కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా అవయవదానం చేసింది ఓ మహిళ.. ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసేందుకు కుటుబసభ్యులు అంగీకరించారు. కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ కిచెందిన ప్రతాప్ రెడ్డి కుమార్తె జి.పావని లత ని నాగర్ కర్నూలు జిల్లా, సింగోటం మండలం, నర్సియిపల్లి గ్రామానికి చెందిన జి.
శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి 6 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె జోష్నా. అయితే భర్త శ్రీనివాస్ రెడ్ది ఒక ప్రైవేట్ కాల్ సెంటర్లలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. గత కొన్ని ఏళ్లు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేవారు. భర్తను బ్రతికించుకోవాలని పావనీ లత ఎంతోమందిని వేడుకున్న ఫలితం లేకుండా పోయింది. చివరికి రెండు సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధితో పావని భర్తమరణించాడు. పావని ఇటీవల హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేందుకు వెళ్లగా ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ లో మూర్చవచ్చి కింద పడడంతో తలకు బలమైన గాయం తగలింది.
గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని PACE ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పావనికి బ్రెయిన్ డెడ్ అయిందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించడంతో అవయవాలు దానం చేస్తే బాగుంటుందని కుటుంబసభ్యులకు సూచించారు. పావని కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు.
దీంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పావని కుటుంబసభ్యులు అందరి అనుమతి తీసుకుని బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుండి ఆర్గాన్ రిట్రివల్ కార్యక్రమం చేపట్టారు. ఆ విదంగా పావని శరీరంలోని ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి కి , కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపించడం జరిగిందని తెలిపారు.