తాజాగా ఆశిష్, రూపాలీ బరువా ఇద్దరు హనీమూన్‌కి వెళ్లారు. ఇండోనేషియాలోని బాలిలో హనామూన్ ట్రిప్ ను ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రూపాలి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది.
దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు.