కాబోయే వరుడి గురించి చెప్తుండగా ఆషు రెడ్డిని లైవ్ లోనే చితకబాదిన తల్లి.

యంగ్ బ్యూటీ, బిగ్‍బాస్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డి చీరకట్టులో హొయలు ఒలికించింది. చమ్కీల చీరలో అందంతో ధగధగ మెరిసింది. అయితే తన అందంతో హావభావాలతో యువతను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పటికి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ,పోస్ట్స్ షేర్ చేస్తూ , రీల్స్ చేస్తూ ఫాల్లోవెర్స్ ని పెంచుకుంటుంది. అయితే ఈ భామ తనకు కాబోయే భర్త గురించి చెప్పేందుకు ఇంస్టాగ్రామ్ లో ఓ ఫన్నీ రీల్ ని చేసింది. ఈ క్రమంలో తన తల్లి స్పదించిన తీరు ఆసక్తిగా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ వీడియో లో తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ ఒక ఆడియోకి లిప్ సింక్ చేసింది. నేను అలిగినపుడు బ్రతిమాలాలి ,ఎక్కువగా షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అంటూ ఉన్న ఒక ఆడియోకి వీడియో ద్వారా లిప్ సింక్ ఇస్తున్న క్రమంలో.. అది అషురెడ్డి వాయిస్ లానే ఉండడంతో తన తల్లి రెండు దెబ్బలు వేసింది. తన తల్లితో దెబ్బలు తిన్న వీడియో కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ‘ఆ వాయిస్ నాదేనని భావిస్తుంది’ అంటూ తల్లిని ఉద్దేశించి కాప్షన్ కూడా పెట్టింది.

ఏదేమైనా.. ఇపుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక అభిమానులు కూడా లైక్స్ కొడుతూ , కామెంట్స్ చేస్తూ ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుస టీవీ ప్రోగ్రామ్స్ , సినిమాలతో బిజీ అయింది అనే చెప్పాలి. ఇప్పటికే ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది అషురెడ్డి . మరి ఈ వీడియోపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *