ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వ కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి ఆరా తీస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది. అయితే తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ ప్రారంభమైన తొలి రోజు కొత్త సభ్యులు, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక మూడో రోజైన నేడు.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.